
అధికారులు మాట మారుస్తున్నారు
2019లో నేను ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో చేరాను. చేరేటప్పుడు పీయూసీ–1కు రూ.36వేల చొప్పున రెండేళ్లకు రూ.72వేలు, ఇంజనీరింగ్ నాలుగేళ్లకు రూ.4వేల చొప్పున రూ.1.60లక్షలు చెల్లిస్తే చాలు అని చెప్పారు. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అధికారులు మాట మారుస్తున్నారు. దీనిపై ఫైనలియర్ విద్యార్థులందరం ధర్నా కూడా చేయడం జరిగింది. ఆర్జీయూకేటీ రిజిష్ట్రార్ అమరేంద్ర కుమార్ విద్యార్థులకు సర్ది చెప్పి త్వరలోనే ఉన్నతాధికారులతో మాట్లాడి ఎంత ఫీజు కట్టాల్సింది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఇప్పటివరకు అధికారుల్లో ఎలాంటి స్పందన లేదు. – వైష్ణవి
(ఈఈఈ విద్యార్థిని), అనంతపురం జిల్లా, సింగనమల గ్రామం