
ఎంవీఐలను విచారించిన ఆర్టీఓ
ప్రొద్దుటూరు క్రైం : విద్యాసంస్థల బస్సుల ఎఫ్‌సీల విషయమై ప్రొద్దుటూరు ఆర్టీఓ మురళీధర్ ఎంవీఐలను విచారించారు. స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ల జారీ విషయమై ఆదివారం సాక్షిలో ‘ఏటీఎస్ వస్తోంది.. ఎఫ్‌సీ చేయించుకోండి’ అనే శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఆర్టీఓ సోమవారం నలుగురు ఎంవీఐలను తన చాంబర్‌కు పిలుపించుకొని విచారణ చేశారు. ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకొని కార్యాలయానికి వచ్చే స్కూల్ వాహనానికి నిబంధనలకు లోబడి అన్నీ సక్రమంగా ఉంటేనే ఎఫ్‌సీ చేస్తున్నామని ఎంవీఐలు ఆర్టీఓకు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే అదనపు వసూళ్లపై కూడా ఆర్టీఓ వారిని ప్రశ్నించారు. ఎఫ్‌సీలకు డబ్బు తీసుకుంటే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరికలు జారీ చేశారు.
ఆగని అదనపు వసూళ్లు..
ప్రొద్దుటూరు ఆర్టీఓ కార్యాలయంలో చేసిన ఎఫ్‌సీలకు అదనపు వసూళ్లు మాత్రం ఆగలే దు. ఎఫ్‌సీ చేయించుకున్న విద్యాసంస్థల బ స్సులు, ఇతర వాహనదారులు దళారుల నుంచి దోపిడీకి గురవుతూనే ఉన్నారు. ఎప్పటి లా గే సోమవారం కూడా ఎఫ్‌సీ చేసిన పలు వా హనాల యాజమాన్యాలకు ‘వసూల్ రాజా’ ఫోన్లు చేసి డబ్బు వసూలు చేసినట్లు తెలిసింది. కొందరు ఏజెంట్ల ద్వారా కూడా ‘వసూలు రాజా’కు డబ్బులు చేరినట్లు సమాచారం.
వ్యక్తి అదృశ్యం
కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధి లో విజయదుర్గా కాలనీకి చెందిన ఓ వ్యక్తి అదృశ్యమైనట్లు తాలూకా ఎస్‌ఐ తాహిర్ హుస్సేన్ తెలిపారు. రవికుమార్ (39) గత నెల 3వతేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదన్నారు. కుటుంబ స భ్యుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమో దు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఎంవీఐలను విచారించిన ఆర్టీఓ