
కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి
● డీఆర్వో విశ్వేశ్వర నాయుడు
కడప సెవెన్‌రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు.
సభాభవన్‌లో పీజీఆర్‌ఎస్ నిర్వహణ
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)ను ఈ సోమవారం సభాభవన్ లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి (మీకోసం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్) వైబ్సెట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చునన్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
డయల్ యువర్ కలెక్టర్
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునన్నారు.
మద్యం దుకాణానికి
దరఖాస్తుల ఆహ్వానం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: జిల్లాలోని జమ్మలమడుగు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని పెద్దముడియం మండలంలో గీత కులాలకు చెందిన మద్యం దుకాణానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా సూపరింటెండెంట్ రవికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, హైబ్రీడ్ విధానంలో ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉంటుందని, 17న కొత్త కలెక్టరేట్‌లో డ్రా తీస్తామన్నారు.