సామాన్యులకు తక్షణ న్యాయం | - | Sakshi
Sakshi News home page

సామాన్యులకు తక్షణ న్యాయం

Apr 30 2025 1:56 AM | Updated on Apr 30 2025 1:56 AM

సామాన

సామాన్యులకు తక్షణ న్యాయం

కడప అర్బన్‌ : పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే సామాన్యుల ఫిర్యాదులకు తక్షణం స్పందించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌ కుమార్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక పెన్నార్‌ పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాలులో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలైన క్రికెట్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌, మట్కా జిల్లాలో ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో పర్యాటకులు సందర్శించే నదులు, చెరువులు, వంకలు, ఇతర నీరు నిల్వ ఉండే కుంటల వద్ద సరదాగా నీటిలో దిగి ప్రమాదాల బారిన పడకుండా ఆయా ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులతో పాటు గస్తీని పెంచాలన్నారు. జిల్లాలో రాత్రి 10:30 గంటల కల్లా షాపులు మూసివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కడప నగరం రింగ్‌ రోడ్డు, ఊటుకూరు సర్కిల్‌, సాక్షి సర్కిల్‌, ఇతర శివారు ప్రాంతాలు, ప్రొద్దుటూరు పట్టణ శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి నేరాలకు తావు లేకుండా నిరంతరం విజిబుల్‌ పోలీసింగ్‌ చేయాలన్నారు. జిల్లాను గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల రహితంగా చేసేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. గంజాయి రవాణా, విక్రయాలపై దాడులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మిస్సింగ్‌ కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, త్వరితగతిన ఆచూకీ కనుగొని వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలని, గతంలో ప్రమాదాలు జరిగిన బ్లాక్‌ స్పాట్స్‌, హాట్‌ స్పాట్స్‌ను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సి.సి కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిరంతరం నిఘా ఉంచాలన్నారు. జిల్లాలో సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా పూర్వ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జి.ఎస్‌. మూర్తి చట్టాలపై పోలీస్‌ అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

పోలీసులకు ప్రశంసా పత్రాలు..

విధుల్లో ప్రతిభ కనబరచిన పోలీస్‌ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి జిల్లా ఎస్పీ అభినందించారు. ప్రశంసా పత్రాలు అందుకున్న పోలీస్‌ అధికారులు, సిబ్బంది వివరాలు

● ఎస్‌.లింగప్ప, సి.ఐ, జమ్మలమడుగు అర్బన్‌

● ఎస్‌.కె చాంద్‌ బాషా, సి.ఐ, పులివెందుల అర్బన్‌

● ఎస్‌.శ్రీనివాసులు, ఎస్‌.ఐ, ప్రొద్దుటూరు వన్‌ టౌన్‌ పి.ఎస్‌

● పి.మొయినుద్దీన్‌, ఎస్‌.ఐ, ముద్దనూరు పి.ఎస్‌

● కె.రఘురామి రెడ్డి పి.సి 2117, ప్రొద్దుటూరు వన్‌ టౌన్‌ పి.ఎస్‌

● ఎస్‌.రాఘవ రెడ్డి, పి.సి 706, చాపాడు పి.ఎస్‌

● వి.వేణుగోపాల్‌ రెడ్డి, హెచ్‌.సి 253, వేముల పి.ఎస్‌

● ఎన్‌.నూరు సాహెబ్‌, హెచ్‌.సి 1179, లింగాల పి.ఎస్‌

● బి.ఎల్లా రెడ్డి, పి.సి 3042, పులివెందుల పి.ఎస్‌

● కె.రామ్‌ రమేష్‌, పి.సి 3255, పులివెందుల పి.ఎస్‌

● ఎస్‌.డి. రియాజ్‌, పి.సి 2906, జమ్మలమడుగు పి.ఎస్‌

● కె.దేవదాసు, హెచ్‌.సి 1987, జమ్మలమడుగు పి.ఎస్‌

● పి.నాగేంద్ర పి.సి 858, జమ్మలమడుగు పి.ఎస్‌

● ఎస్‌.కె బాషా, పి.సి 2118, సి.సి.ఎస్‌, కడప

● పి.సుదర్శన్‌ రెడ్డి పి.సి 2838 , సి.సి.ఎస్‌, కడప

● సి.రమేష్‌, హెచ్‌.సి 105, ముద్దనూరు పి.ఎస్‌

● ఎన్‌.గురుమోహన్‌, పి.సి 3455, ముద్దనూరు పి.ఎస్‌

సామాన్యులకు తక్షణ న్యాయం 1
1/15

సామాన్యులకు తక్షణ న్యాయం

సామాన్యులకు తక్షణ న్యాయం 2
2/15

సామాన్యులకు తక్షణ న్యాయం

సామాన్యులకు తక్షణ న్యాయం 3
3/15

సామాన్యులకు తక్షణ న్యాయం

సామాన్యులకు తక్షణ న్యాయం 4
4/15

సామాన్యులకు తక్షణ న్యాయం

సామాన్యులకు తక్షణ న్యాయం 5
5/15

సామాన్యులకు తక్షణ న్యాయం

సామాన్యులకు తక్షణ న్యాయం 6
6/15

సామాన్యులకు తక్షణ న్యాయం

సామాన్యులకు తక్షణ న్యాయం 7
7/15

సామాన్యులకు తక్షణ న్యాయం

సామాన్యులకు తక్షణ న్యాయం 8
8/15

సామాన్యులకు తక్షణ న్యాయం

సామాన్యులకు తక్షణ న్యాయం 9
9/15

సామాన్యులకు తక్షణ న్యాయం

సామాన్యులకు తక్షణ న్యాయం 10
10/15

సామాన్యులకు తక్షణ న్యాయం

సామాన్యులకు తక్షణ న్యాయం 11
11/15

సామాన్యులకు తక్షణ న్యాయం

సామాన్యులకు తక్షణ న్యాయం 12
12/15

సామాన్యులకు తక్షణ న్యాయం

సామాన్యులకు తక్షణ న్యాయం 13
13/15

సామాన్యులకు తక్షణ న్యాయం

సామాన్యులకు తక్షణ న్యాయం 14
14/15

సామాన్యులకు తక్షణ న్యాయం

సామాన్యులకు తక్షణ న్యాయం 15
15/15

సామాన్యులకు తక్షణ న్యాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement