కడప ఎడ్యుకేషన్ : జీవో నెంబర్ 117 రద్దు పేరుతో విడుదల చేసిన మార్గదర్శకాలు ఉపాధ్యాయులకు అన్యాయం జరిగే విధంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడప జెడ్పీ సమావేశ మందిరంలో జీవో నెంబర్ 117 రద్దు, 3, 4, 5వ తరగతులు వెనక్కు పంపై అంశంపై సమావేశం జరిగింది. ఉపాధ్యాయ సంఘ నాయకులు, మేధావులను ఆహ్వానించకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. గత ప్రడుత్వం ప్రతి విద్యార్థికి సబ్జెక్టు టీచర్‌తో బోధన జరగాలనే ఉద్దేశంతో ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4 ,5వ తరగతలను జెడ్పీ పాఠశాలలకు అనుసంధానం చేసింది. వీటితో జరిగే ప్రయోజనాలపై ఇప్పుడిప్పుడే చర్చ మొదలైది. ఇంతలోనే 117 జీవో రద్దు చేస్తూ నూతన మార్గదర్శకాలను రూపొందించారు. దీంతో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 3, 4, 5వ తరగతుల సబ్జెక్టు టీచర్లు ఉండరు. దీంతో డ్రాపౌట్స్ పెరిగే ప్రమాదం నెలకొంది. టీచర్ల సర్దుబాటు చేయడంతో ఉన్నత పాఠశాలల్లో ఎక్కవ సంఖ్యలో స్కూల్ అసిస్టెంట్ టీచర్ల పోస్టులు మిగులు చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. గత నాలుగు నెలలుగా సంఘాలతో సమావేశాలు జరిపి వారి సూచనలు తీసుకోకుండా అనుకున్న విధంగానే మార్గదర్శకాలు విడుదల చేయడంపై ఉపాధ్యాయ సంఘాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి
21 గ్యాస్ సిలెండర్లు స్వాధీనం
కడప అర్బన్ : కడప రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి జి. శ్రీనివాస రావు ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు, సిబ్బందితో కలిసి వివిధ హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 21 ఇండేన్, హెచ్‌పీ గృహ అవసర సిలిండర్లను సీజ్ చేశారు. 5 వ్యాపార సంస్థల యజమానులపై నిత్యావసర సరుకుల చట్టం 1955 మేరకు 6(ఏ) కేసు నమోదు చేశారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ అధికారులైన డిసిటిఓ బి. గీతావాణి, సీఎస్‌డీటీ పి.సౌజన్య తదితరులు పాల్గొన్నారు.