
●అడుగడుగునా అండ
రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారికి కావాల్సిన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తోంది దీంతోపాటు పంటలసాగకు సాయంగా రైతుభరోసాను అందిస్తూ ఆదుకుంటుంటోంది. అలాగే విత్తనం మొదలు పంట దిగుబడుల విక్రయం వరకు ఉన్న ఉర్లోనే ఆర్‌బీకేల ద్వారా సేవలను అందిస్తూ అడుగడుగునా అండగా నిలుస్తోంది. జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభౖమైయ్యే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పంటల సాగుకు అవసరమైన ఎరువులు, వేరుశనగ, పచ్చిరొట్టె విత్తనాల ముందస్తుగా కేటాయించింది. ఇప్పటికే ఆర్‌బీకేల ద్వారా పచ్చిరొట్ట విత్తనాలు, వేరుశనకాయలు కోసం రిజిస్ట్రేషన్‌ను చేసుకుంటున్నారు.