రాజంపేట: రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఐదు రైల్వేస్టేషన్లలో పలు రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను రాజంపేట లోక్‌సభ సభ్యుడు పీవీ మిథున్‌రెడ్డి కోరారు. మంగళవారం రైల్వేశాఖమంత్రితో ఆయన కార్యాలయంలో ఎంపీ భేటీ అయ్యారు. హాల్టింగ్స్‌కు సంబంధించి పూర్తి వివరాలతో మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్‌కు ముందు ఏ రైళ్లకు హాల్టింగ్స్ ఉన్నాయో వాటన్నింటిని పునరుద్ధరించాలని, అలాగే రైల్వేకోడూరు, ఓబులవారిపల్లెలో ఆర్‌యూబీ నిర్మించాలని కోరామన్నారు. ఇందుకు రైల్వేమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.