
బయో రీసోసర్స్ సెంటర్ పనితీరును తెలుసుకుంటున్న ఫిలిప్పీన్స్ ప్రతినిధులు
కడప కోటిరెడ్డిసర్కిల్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళాలను నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధికల్పనాధికారి దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. ప్లిప్ కార్ట్ కంపెనీలో డెలీవరీ బాయ్, అలీ డిక్షన్ కంపెనీలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, డిప్లొమో ఇంజనీర్ ట్రైనీ, అజెంబుల్ ఆపరేటర్ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమో, బిటెక్, ఎంబీఏ చదివిన యువతీ యువకులు అర్హులన్నారు. 19–40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ధృవపత్రాలు, ఫొటోలు తీసుకుని ఈనెల 31న తమ కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. ఎంపికై న వారికి రూ.10,000 నుంచి రూ.25,000 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌సీఎస్.జీఓవి.ఇన్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని ఆమె కోరారు.
మే 1 నుంచి 30 వరకు వేసవి క్రీడాశిక్షణ శిబిరాలు
కడప స్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాథికార సంస్థ ఆదేశాల మేరకు మేనెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో క్రీడాశిక్షణ శిబిరాలను నిర్వహించనున్నట్లు స్టెప్ సీఈఓ సి. సాయిగ్రేస్, డీఎస్‌ఏ చీఫ్ కోచ్ ఎన్.వి.పి. అమృత్‌రాజ్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో మొత్తం 50 వేసవి క్రీడాశిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి అన్ని క్రీడావిభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 8 నుంచి 14 సంవత్సరాలలోపు వయసు కలిగిన విద్యార్థినీ, విద్యార్థులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు ఆసక్తి గల క్రీడాసంఘాల ప్రతినిధులు, స్వచ్ఛందసంస్థల, ఎస్‌జీఎఫ్ ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, కోచ్‌లు, సీనియర్ క్రీడాకారులు ఏప్రిల్ 4వ తేదీలోపు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. దరఖాస్తులో క్రీడాంశం, నిర్వహించే ప్రదేశం, మండలం, నియోజకవర్గం, గ్రామీణ/పట్టణ శిబిరం, నిర్వహించే వారి పేరు, హోదాను తెలియజేస్తూ దరఖాస్తులను కడప కలెక్టరేట్‌లోని డీ బ్లాక్‌లోని స్టెప్ కార్యాలయంలో అందజేయా లని సూచించారు. పూర్తి వివరాలకు 63006 64935 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.
వయోజన విద్య జిల్లా
ఉపసంచాలకుడిగా సుబ్బారెడ్డి
కడప కోటిరెడ్డిసర్కిల్: వయోజన విద్య జిల్లా ఉపసంచాలకుడిగా మల్లు వెంకట సుబ్బారెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న మహమ్మద్ ఆజాద్ నెల్లూరుకు బదిలీ అయ్యారు. అనంతరం వెంకట సుబ్బారెడ్డికి అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. సుబ్బారెడ్డి సాయంత్రం కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయరామరాజును మర్యాదపూర్వకంగా కలిశారు.
సేంద్రీయ పంటల పరిశీలన
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు మండల పరిధిలోని కల్లూరు, తాళ్లమాపురం గ్రామాల్లో ఫిలిప్పీన్స్ యాక్సిస్ అగ్రికల్చరల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు నందిని, ధనిషా, పుదుచ్చేరికి చెందిన అరవిందో ఫౌండేషన్ నుంచి 35 మంది రైతులు మంగళవారం ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కల్లూరులో ప్రొద్దుటూరు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో సర్పంచ్ వల్లూరు శివలక్ష్మీ నాగేంద్రరెడ్డి సాగు చేస్తున్న వరి పంటను వారు పరిశీలించారు. బయోరీసోర్సెస్ సెంటర్‌ను సందర్శించి తయారు చేస్తున్న బయోఫర్టిలైజర్స్, కషాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం రాష్ట్ర కోఆర్డినేటర్ ఆదినారాయణ, ప్రొద్దుటూరు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ సీఈఓ పవన్‌కుమార్, అగ్రికల్చరల్ ప్రోగ్రాం ఆఫీసర్ రవితేజ, బ్లాక్ కోఆర్డినేటర్ మునిలక్ష్మి, కిసాన్ మిత్ర ఫీల్డ్ కోఆర్డినేటర్ జయన్న పాల్గొన్నారు.
