
రెండు రోజులుగా నాగ సిందూరి కన్పించకపోవటంతో కుటుంబీకులు
చాపాడు : ఖాదర్‌పల్లె గ్రామానికి చెందిన కత్తి నాగ సిందూరి(30) అనే వివాహిత రెండు రోజులుగా కన్పించటం లేదని బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ కేసీ రాజు తెలిపారు. మైదుకూరు మండలంలోని ఉత్సలవరం గ్రామానికి చెందిన నాగ సిందూరికి పదేళ్ల క్రింద చాపాడు మండలంలోని ఖాదర్‌పల్లె గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైందన్నారు. జీవనోపాధి కోసం నాగ సిందూరి భర్త విదేశాలకు వెళ్లగా.. ఇటీవలనే ఇంటికి వచ్చిన ఆయన కొన్ని రోజుల తర్వాత మళ్లీ విదేశాలకు వెళ్లాడన్నారు. ఈ క్రమంలో రెండు రోజులుగా నాగ సిందూరి కన్పించకపోవటంతో కుటుంబీకులు ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.