సిద్దవటం : మండల పరిధిలోని భాకారపేట గ్రామ సమీపంలో ఉన్న ఏపీఎస్పీ 11వ బెటాలియన్‌కు చెందిన 8వ తరగతి చదవుతున్న సి.ప్రణీత్ కుమార్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాఽధించినందుకు కమాండెంటు శ్రీనివాసరావు శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెటాలియన్లో పోలీసుగా పని చేస్తున్న సి.శివప్రసాద్, లక్ష్మీరెడ్డిమ్మ కుమారుడు ప్రణీత్‌కుమార్ ఆంగ్ల భాషలో అక్షరాలు అయిన ఎ నుంచి జెడ్ వరకు 3.30 సెకన్లలో టైప్ చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారన్నారు. ఈ విషయమై కమాండెంట్ శ్రీనివాసరావు సదరు తల్లిదండ్రులకు, ప్రణీత్‌కుమార్‌లను సత్కరించి మెమెంటోలను అందజేసి అభినందలు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంటు కమాండెంటు కె. వెంకట్‌రెడ్డి, బెటాలియన్ ఆఫీస్ ఏఓ గులాం దస్తగిరి, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్‌ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.