భువనగిరిటౌన్ : మూడు దశాబ్దాల పాటు కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా జగ్జీవన్‌రామ్ దేవానికి అందించిన సేవలు మరుమలేనివని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం భువనగిరిలోని బాబు జగ్జీవన్‌రామ్ చౌరస్తా, ప్రిన్స్ కార్నర్, రైతు బజార్ ప్రాంతాల్లో డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, వెంకారెడ్డితో కలిసి ఎమ్మెల్యే హాజరై జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహనీయుల ఆశయాల సాధనకు అందరం కృషిచేద్దామని పిలుపునిచ్చారు. ఏప్రిల్ నెల మహనీయుల మాసమని, ప్రతిఏటా జగ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే, అంబేద్కర్ వంటి మహనీయుల జయంతి ఉత్సవాలను జరుపుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, వెంకారెడ్డి మాట్లాడుతూ 1971 యుద్ధ సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఎస్సీ అభివృద్ధి అధికారి సాహితి, మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీవాణి, వైస్ చైర్‌పర్సన్ మంజుల, దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి


