కేసీఆర్‌ క్యాంప్‌ ఆఫీస్‌పై దాడి దారుణం | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ క్యాంప్‌ ఆఫీస్‌పై దాడి దారుణం

Apr 6 2026 8:36 AM | Updated on Apr 6 2026 8:36 AM

ఆలేరు రూరల్‌ : ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంతి, గజ్వేల్‌ ఎమ్మెల్యే కేసీఆర్‌ క్యాంప్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ గుండాలు దాడి చేయడం దారుణ చర్య అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. దాడిని ఖండిస్తూ ఆదివారం ఆలేరులోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్తరలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముమ్మాటికి ఇది సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి అని ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులు తీరు బిహార్‌ గ్యాంగ్‌ను తలపిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రజాప్రతినిధులపై, ప్రజా సంఘాలపై, మీడియాపై దాడులు నిత్యకృత్యం కావడం సిగ్గుచేటు అన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్‌ పార్టీకి సైన్యంలా మారిపోయిందన్నారు. దాడి చేసిన వారిపై కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం, కుండె సంపత్‌, పత్తి వెంకటేష్‌, జూకంటి సంపత్‌, బాలస్వామి, పూల శ్రవణ్‌, పల్లె మహేష్‌, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

క్రీడలతో భవిష్యత్‌పై

అవగాహన పెరుగుతుంది

హుజూర్‌నగర్‌ : క్రీడలతో యువతకు భవిష్యత్‌పై సరైన అవగాహన పెరుగుతుందని ఆల్‌ ఇండియా కబడ్డీ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ, టెక్నికల్‌ కమిటీ చైర్మన్‌ జగదీష్‌ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. యువత సరైన భవిష్యత్‌ కోసం క్రీడల వైపు మొగ్గు చూపాలన్నారు. క్రీడల వల్ల శారీరక, మానసిక దృఢత్వాన్ని పొందుతారని చెప్పారు. యువత స్వయంఉపాధి అవకాశాలను పెంపొందించుకొని ఆర్థిక పరిపుష్టిని సాధించాలన్నారు. కార్యక్రమంలో ఆలిండియా కబడ్డీ ఫెడరేషన్‌ టెక్నికల్‌ కమిటీ కన్వీనర్‌, తెలుగు టైటానన్స్‌ ఫౌండర్‌ అండ్‌ కోచ్‌ జగన్మోహన్‌, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ భూలోకరావు, జాయింట్‌ సెక్రటరీ గట్టయ్య, జిల్లా కార్యదర్శి నరసింహా రావు, మున్సిపల్‌ చైర్మన్‌ దొంతగాని శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ కోతి సంపత్‌రెడ్డి, నాయకులు సీహెచ్‌ వీరారెడ్డి, ఎం.గోపిరెడ్డి, కె.జయరాజ్‌, రమేష్‌, అశోక్‌రెడ్డి, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement