శ్రీనిధి రుణాల్లో అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

శ్రీనిధి రుణాల్లో అక్రమాలు

Apr 6 2026 7:12 AM | Updated on Apr 6 2026 7:12 AM

హుజూర్‌నగర్‌ : పాలకవీడు మండలంలోని రావిపహాడ్‌ గ్రామంలో మహిళా సంఘాల రుణాల్లో భారీ అకమ్రాలు చోటుచేసుకున్నాయి. రుణాలపై శనివారం గ్రామంలో అధికారులు సోషల్‌ ఆడిట్‌ నిర్వహించారు. ఈమేరకు శ్రీనిధి రుణాల్లో సుమారు రూ.50 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు తేలింది. అయితే ఎలాంటి బకాయి లేకున్నా తమ పేరున లక్షల్లో బకాయి ఉన్నట్లు సూచించడంతో సభ్యులు అవాక్కయ్యారు. తాము ఎలాంటి రుణాలు పొందలేదని, పొందిన రుణాలు సకాలంలో చెల్లించామని పేర్కొన్నారు.

వీఓఏ చేతివాటం..

మహిళా సంఘాల రుణాల్లో వీఓఏ చేతివాటం ఉన్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తీసుకున్న రూ.50 వేల రుణాన్ని వడ్డీతో సహా చెల్లించినా ఇంకా రూ.75 వేలు బాకీ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారని ప్రభు సంఘానికి చెందిన ఓ సభ్యురాలు వాపోయింది. దీనిపై విచారించగా.. ఆటో డెబిట్‌ సిస్టం ద్వారా ఆమె ఖాతా నుంచి నెలకు రూ.2,500 చొప్పున గ్రామ వీఓఏ సొంత ఖాతాకు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. ఇలా ఒక్కరోజే ఆరు విడతలుగా రూ.15 వేలు వీఓఏ ఖాతాకు వెళ్లాయి. అదేవిధంగా జ్యోతి సమభావన సంఘానికి చెందిన సంధ్యకు తెలియకుండానే రూ.2 లక్షల రుణం మంజూరైపోయింది. ఇప్పుడు బకాయి కట్టాలని వేధిస్తుండడంతో ఆ కుటుంబం లబోదిబోమంటోంది. ఇలా గ్రామంలోని 22 సంఘాల్లో సభ్యులకు తెలియకుండా అప్పులు సృష్టించినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో శివ సంఘంలో రూ. 20 లక్షల వరకు అక్రమాలు జరగ్గా అధికారులు కేవలం రూ.10 లక్షలు రికవరీ చేసి చేతులు దులుపుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

బాధ్యులపై వేటు పడేనా..

పదేపదే అక్రమాలకు పాల్పడుతున్న వీఓఏపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు వెనకడుగు వేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనులు చేసుకునే పేదల పొట్టగొట్టి లక్షలు గడిస్తున్న వారి వెనుక ఉన్న సూత్రదారులెవరో తేల్చాలని.. అక్రమాలపై రాఫ్ట్రస్థాయి ఎంక్వయిరీ జరిపించాలని రావిపహాడ్‌ గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

రావిపహాడ్‌లో సోషల్‌ ఆడిట్‌

నిర్వహించిన అధికారులు

సుమారు రూ.50 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు తేలడంతో విస్తుపోయిన సభ్యులు

రుణాలు సకాలంలో చెల్లించామని

వాపోయిన గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement