కేంద్రపాలిత ప్రాంతం కుట్రను తిప్పికొట్టాలి | - | Sakshi
Sakshi News home page

కేంద్రపాలిత ప్రాంతం కుట్రను తిప్పికొట్టాలి

Apr 6 2026 7:12 AM | Updated on Apr 6 2026 7:12 AM

సూర్యాపేట అర్బన్‌ : హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని ప్రొఫెసర్‌ వినాయకరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కుట్రలు పన్నారని, దానిని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. ఢిల్లీలో ఆప్‌ పాలనలో ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఎన్ని కుట్రలు చేశారో అందరూ గమనించారన్నారు. ఇప్పుడు తెలంగాణను కూడా అదేవిధంగా చేయాలని కేంద్రం ఆలోచిస్తుందన్నారు. ఈ కుట్రలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి కుడా భాగం ఉందన్నారు. హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశానని చెబుతున్న చంద్రబాబు.. ఇప్పుడు తెలంగాణను వెనక్కి నెట్టాలని చూస్తున్నారన్నారు. సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్‌ ఎల్‌ భద్రయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జేవీ చలపతిరావు, తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి కె. ధర్మార్జున్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్‌, డాక్టర్‌ రంగారెడ్డి, రాయపూడి చిన్ని, పందిరి నాగిరెడ్డి, టీపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి పుప్పాల వీరన్న, డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య, టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాని కష్ణారెడ్డి, బుద్ధ సత్యనారాయణ, కునుకుంట్ల సైదులు, ఉదయగిరి, హరికృష్ణ, భరత్‌, వెంకట్‌యాదవ్‌, పుప్పాల రవికుమార్‌, మల్లయ్య, రాచూరి ప్రతాప్‌, జానయ్య, వీరబోయిన రమేష్‌, జీఎల్‌ఎస్‌ రెడ్డి, లింగయ్యయాదవ్‌, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement