రెండో విడతకు రెడీ
సాక్షి,యాదాద్రి: రెండో విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల సామగ్రిని ఇప్పటికే మండల కేంద్రాలకు తరలించారు. శనివారం ఉదయం పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ద్వారా విధులు కేటాయించి పోలింగ్ సామగ్రి అందజేయనున్నారు. అనంతరం వారిని ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు చేరవేస్తారు. ఈ విడతలో భువనగిరి, బీబీనగర్, వలిగొండ, భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2,02,716 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.ఇందులో పురుషులు 1,00,801, మహిళా ఓటర్లు 1,01,915 మంది ఉన్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటిస్తారు.
సర్పంచ్ బరిలో 388 మంది
రెండో దశలో 150 పంచాయతీలు, 1,332 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో 10 పంచాయతీలు, 171 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 140 గ్రామ పంచాయతీలు, 1,161 వార్డులకు ఆదివారం పోలింగ్ జరగనుంది. సర్పంచ్ పదవికి 388 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 2,821 మంది పోటీ పడుతున్నారు. వీరంతా గెలుపుకోసం సర్వశక్తులొడ్డారు.
ఫ 140 పంచాయతీల్లో రేపు పోలింగ్
ఫ ఓటు హక్కు వినియోగించుకోనున్న 2,02,716 మంది ఓటర్లు


