పొరపాట్లకు తావుండరాదు
భూదాన్‌పోచంపల్లి: రెండో విడతలోనూ పొరపాట్లకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు సూచించారు. భూదాన్‌పోచంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి చూసుకోవాలని, బ్యాలెట్ పేపర్లు, గుర్తులతో పాటు ఓటరు జాబితా సరిచూసుకోవాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పెండింగ్ భూభారతి దరఖాస్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాపర్తి భాస్కర్, తహసీల్దార్ శ్రీనివా స్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వర్‌రావు, ఆర్‌ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, ఎంపీఓ మాజిద్, సూపరింటెండెంట్ ఏపాల సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు


