నీట్ కోచింగ్ సెంటర్ విద్యార్థులకు వరం
బొమ్మలరామారం: వైద్యరంగంలో ప్రవేశించాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు నీట్ కోచింగ్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని డీఈఓ సత్యనారాయణ తెలిపారు. బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన నీట్ కోచింగ్ సెంటర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా అన్ని కేజీవీబీల్లో ఇంటర్ విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్‌లో 25 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచారని తెలిపారు. వీరికి మల్యాల కేజీవీబీలో ఏర్పాటు చేసిన నీట్ కోచింగ్ సెంటర్‌లో చేర్చినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు నీట్ శిక్షణను సద్వినియోగం చేసకొని వైద్య విద్య కలను సాకారం చేసుకోవాలని కోరారు. సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. అనంతరం విద్యార్థులో కలిసి ఫొటో దిగారు. ఈ కార్యక్రమంలో జీసీడీఓ రాధ, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సాయిలక్ష్మి నీట్ ఫ్యాకల్టీలు, సిబ్బంది పాల్గొన్నారు.


