నార్కట్‌పల్లి: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడు ఢీకొని మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమ వారం సాయంత్రం నార్కట్‌పల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన కొత్త చంద్రశేఖర్(21) ఢిల్లీలో బీటెక్ చదువుతున్నాడు. చంద్రశేఖర్ సోమవారం రాత్రి మరో వ్యక్తి దుర్గం రిషికేష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై అమ్మనబోలు నుంచి నార్కట్‌పల్లి వైపు వస్తుండగా.. అమ్మనబోలు చౌరస్తా కల్వర్టు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్, రిషికేష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ చంద్రశేఖర్ మృతిచెందాడు. చంద్రశేఖర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


