జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి స్వస్థలం వనిపాకల
చిట్యాల: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని వనిపాకల గ్రామం. చాలా ఏళ క్రితమే ఆయన హైదరాబాద్‌లో సిర్థపడ్డారు. 2023 శాసనసభ ఎన్నికల్లో సైతం ఆయన ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడుగా కూడా కొనసాగుతున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన నామినేషన్ ర్యాలీలో ఆయనతో పాటు చిట్యాల మండలానికి చెందిన పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


