క్షేత్రపాలకుడికి ఆకుపూజ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతోపాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సింధూరంతోపాటు పాలతో మన్యసూక్త పారాయణములతో అభిషేకం నిర్వహించారు. ఆంజనేయస్వామిని సుగంధం వెదజల్లే ద్రవ్యాలు, పూలతో అలంకరించి, నాగవల్లి దళార్చన చేపట్టారు. అదేవిధంగా శ్రీ సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండిజోడు సేవలు వంటి పూజలు కొనసాగాయి.


