
కలంపై కక్షకట్టిన కూటమి ప్రభుత్వం
ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం అసమర్థతను కలం రూపంలో ప్రజలకు తెలియజేస్తున్న సాక్షి దినపత్రిక, ఎడిటర్ ధనంజయ్‌రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కక్షకట్టి అక్రమ కేసులు పెట్టడం బాధాకరం. రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధగా పాలించాల్సిన బాధ్యతను పక్కన పెట్టి రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా చంద్రబాబు ప్రభుత్వం మారుస్తూ ప్రతికా స్వేచ్ఛగా భంగం కలిగిస్తోంది. సాక్షి యాజమాన్యానికి, ఎడిటర్ ధనంజయ్‌రెడ్డికి మేమంతా మద్దతుగా నిలుస్తాం.
– కళ్లెం కృష్ణ, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు