
‘స్థానిక’ పోటీకి దరఖాస్తులు అందజేయండి
భువనగిరిటౌన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే యువజన కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ ఖలీల్ జావేద్ కోరారు. భువనగిరిలోని సంకల్ప్ హోటల్లో నిర్వహించిన యువజన కాంగ్రెస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. యువజన కాంగ్రెస్ నాయకత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన స్థానం కల్పిస్తామన్నారు. సోషల్ మీడియాపై యూత్ కాంగ్రెస్ ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై యువజన కాంగ్రెస్ నాయకులు పోరాడాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడెం సంజీవరెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అవైస్ చిస్తీ, యువజన కాంగ్రెస్ జిల్లా ఇంచార్జ్ దుబ్బాక చంద్రిక, నాయకులు కుంభం కిర్తీరెడ్డి, వెల్మినేటీ సురేష్, నిఖీల్, లకావత్ సురేష్, బొల్లెపల్లి జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.