
మహిళా సంఘాల పనితీరు మెరుగునకే కరదీపిక
భువనగిరిటౌన్ : నూతనంగా ఏర్పాటైన మహిళా సంఘాల నిర్వహణ, సంఘాల లీడర్ల శక్తివంతీకరణకు దోహదపడే ఉద్దేశంతో ప్రత్యేకంగా రూపొందించిన అక్షరాస్యత సమాచార కరదీపికను సోమవారం కలెక్టర్ హనుమంతరావు ఆవిష్కరించారు. మహిళలు శక్తివంతులు కావడం వల్ల దేశానికి బలం చేకూరుతుందన్నారు. సంఘాల నిర్వహణ, నాయకత్వ లక్షణాలు, ఆర్థిక నిర్వహణ, గ్రూపుల పనితీరు మెరుగుపర్చుకునేందుకు కరదీపిక దోహదపడుతుందన్నారు. కరదీపికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, వీరారెడ్డి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, అదనపు డీఆర్‌డీఓ జంగారెడ్డి, డీపీఎంలు, స్వయం సహాయక మహిళా సంఘాల లీడర్లు పాల్గొన్నారు.