108 అంబులెన్స్‌ను ఢీకొట్టిన మరో అంబులెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

108 అంబులెన్స్‌ను ఢీకొట్టిన మరో అంబులెన్స్‌

May 4 2025 6:33 AM | Updated on May 4 2025 6:33 AM

108 అంబులెన్స్‌ను ఢీకొట్టిన మరో అంబులెన్స్‌

108 అంబులెన్స్‌ను ఢీకొట్టిన మరో అంబులెన్స్‌

కొండమల్లేపల్లి: కొండమల్లేపల్లి నుంచి దేవరకొండ వైపు వెళ్తున్న 108 అంబులెన్స్‌ డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో వెనుక నుంచి వస్తున్న మరొక 108 అంబులెన్స్‌ ఢీకొట్టింది. ఈ ఘటన కొండమల్లేపల్లి మండలం కొల్‌ముంతలపహాడ్‌ గ్రామ పంచాయతీ సమీపంలోని బాపూజీనగర్‌ వద్ద శనివారం జరిగింది. ప్రమాదానికి గురైన అంబులెన్స్‌ను తప్పించబోయి దేవరకొండకు ప్యాసింజర్‌లను ఎక్కించుకొని వెళ్తున్న ఆటో పల్టీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులతో పాటు అంబులెన్స్‌ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు అంబులెన్స్‌, ఆటోను స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement