తాటిముంజ.. తింటే మజా | - | Sakshi
Sakshi News home page

తాటిముంజ.. తింటే మజా

May 4 2025 6:33 AM | Updated on May 4 2025 6:33 AM

తాటిమ

తాటిముంజ.. తింటే మజా

యాదగిరిగుట్ట రూరల్‌: వేసవి కాలంలో మాత్రమే దొరికే తాటిముంజలను చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ఎంతో ఇష్టంగా తింటారు. వీటినే ఐస్‌ యాపిల్‌ అని కూడా అంటారు. ఈ తాటిముంజల్లో అమితమైన పోషకాహార పదార్ధాలు ఉంటాయి. అందువల్ల ప్రతిఒక్కరూ ఈ ముంజలను తినడానికి ఎంతో ఇష్టపడతారు. వేసవి కాలంలో ఈ తాటిముంజలు తినడం వలన, ఎండ వేడికి ఉపశమనంతో పాటు ఆరోగ్యానికి అనేక రకాలైన ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పల్లెల్లో మాత్రమే లభించే ఈ తాటిముంజలు ఇప్పుడు పట్టణాలకు కూడా తాకాయి. ముంజల అమ్మకంతో వేసవి కాలంలో ఉపాధి కూడా లభిస్తుందని గీత కార్మికులు, పండ్ల వ్యాపారులు చెబుతున్నారు.

జాతీయ రహదారుల వెంట అమ్మకం

వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారిలో తాటిముంజల అమ్మకం విపరీతంగా పెరిగిపోయింది. ఆలేరు బైపాస్‌, వంగపల్లి, రాయగిరి, గూడూరు టోల్‌ప్లాజా గుండా వెళ్తున్న వాహనాలతో పాటు యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి దర్శనానికి విచ్చేసే భక్తులు ఎక్కువగా తాటిముంజలను కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు ఇతర ప్రధాన కూడళ్లలో కూడా తాటిముంజలను అమ్ముతుండడంతో వాహనదారులు వాటిని చూసి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వేసవి కాలంలో తాటిముంజలు అమ్మకాలు పెరిగిపోవడంతో పలువురికి ఉపాధి కూడా లభిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పండ్ల వ్యాపారులు, గీత కార్మికులు తదితరులు తాటిముంజల గెలలను గ్రామాల్లో నుంచి తీసుకొచ్చి జాతీయ రహదారులపై, ప్రధాన కూడళ్లలో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు.

ఎండల తీవ్రతకు పెరుగుతున్న తాటిముంజల విక్రయం

ముంజలలో అనేక పోషకాలు ఉంటాయంటున్న వైద్య నిపుణులు

డజన్‌ రూ.100 వరకు అమ్మకం

వేసవిలో ఉపాధి పొందుతున్న గీత కార్మికులు, వ్యాపారులు

తాటిముంజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

u శరీరంలో వేడిని తగ్గిస్తుంది

u బాడీని డీహైడ్రేషన్‌ నుంచి కాపాడుతాయి

u గర్భిణులకు ఎసిడిటీ నుంచి రక్షణ కల్పిస్తుంది

u మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది

u కాలేయం, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నివారణకు ఉపయోగపడతాయి

u అధిక బరువును తగ్గిస్తుంది

u గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉపయోగపడుతుంది

u రక్తపోటును అదుపులో

ఉంచుంతుంది

u జీర్ణశక్తిని పెంచుతుంది

u ఐరన్‌, కాల్షియం శరీరానికి లభిస్తాయి

తాటిముంజ.. తింటే మజా1
1/1

తాటిముంజ.. తింటే మజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement