అమ్మ ప్రసాదం.. మోక్షదాయకం | - | Sakshi
Sakshi News home page

అమ్మ ప్రసాదం.. మోక్షదాయకం

Jan 20 2026 8:29 AM | Updated on Jan 20 2026 8:29 AM

అమ్మ

అమ్మ ప్రసాదం.. మోక్షదాయకం

భోజన సౌకర్యం బాగుంది

అన్నప్రసాదం ఏర్పాట్లు సంతోషకరం

భీమవరం (ప్రకాశం చౌక్‌): భీమవరం ఇలవేల్పు శ్రీమావుళ్లమ్మ అమ్మవారి 62వ వార్షికోత్సవ మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించేందుకు భక్తులు దూరప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. వారికి ఉత్సవాల నిర్వాహకులు నీరులి ్లకూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత భోజనం సౌకర్యం కల్పించారు. రెండు రకాల కూరలు, పప్పు, పచ్చడి, సాంబారు, పెరుగు, స్వీట్‌, పండు తదితర వాటిని భోజనంలో వడ్డిస్తున్నారు. ఈనెల 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 12న ఉత్సవాలు ముగిసే వరకూ నెల రోజులపాటు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. రోజుకు సుమారు వెయ్యి నుంచి 1,500 మంది భక్తులకు భోజన ప్రసాదం అందిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి ఆలయం వద్ద భోజన సౌకర్యం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చే భక్తులు పట్టణంలో హోటళ్లకు వెళ్లి భోజనం చేసే ఇబ్బంది లేకుండా ఆలయం వద్దే అమ్మవారి ప్రసాదం భోజన రూపంలో స్వీకరించడం మర్చిపోలేని అనుభూతి కల్పిస్తుందని అంటున్నారు.

గత పదేళ్లుగా ఏర్పాట్లు

శ్రీమావుళ్లమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవాలను ఏటా నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం, అమ్మవారి ఉత్సవ కమిటీ ఘనంగా నిర్వహిస్తుంది. ఉత్సవాల ముగింపునాడు సుమారు లక్ష మందికి అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నారు. అయితే నెల రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం తరలివచ్చే భక్తులకు అన్న ప్రసాదం అందించాలని నిర్వాహకులు నిర్ణయించారు. గత పదేళ్లుగా ఉత్సవాల నెల రోజులపాటు నిత్యం భక్తులకు అన్నదానం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, కాకినాడ, మచిలీపట్నం, అమలాపురం తదితర దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. వారికి ఆలయం వద్ద ఉన్న వర్తక భవనంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నిర్విరామంగా భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సుమారు రోజుకు రూ.50 వేలు భోజనానికి ఖర్చు చేయగా, ఉత్సవాల్లో నెలరోజులపాటు ఉచిత భోజన కార్యక్రమానికి రూ.10 నుంచి 12 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నారు.

అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్న భక్తులు భోజన ప్రసాదం కోసం క్యూలైన్లో భక్తులు

మావుళ్లమ్మ వార్షిక మహోత్సవాల్లో భక్తులకు నిత్యం అన్నదానం

రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తులు

రోజుకు సుమారు 1,500 మందికి అన్నప్రసాదం వితరణ

నేను గత రెండేళ్లుగా అమ్మవారి వార్షిక మహోత్సవాలను తిలకించడానికి వస్తున్నాను. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అమ్మవారి సన్నిధి వద్దే భోజనం ఏర్పాటు చేయడం బాగుంది. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికి భోజనం నాణ్యత తగ్గకుండా పెట్టడం అభినందనీయం.

– ఎం.వెంకట లక్ష్మి, మచిలీపట్నం

శ్రీమావుళ్లమ్మవారి ఉత్సవాలను తిలకించడానికి నేను మొదటిసారి వచ్చాను. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన ప్రసాదం స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలు, వృద్ధులతో వచ్చే వారికి ఆలయం వద్దే అన్నదానం ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

– సీహెచ్‌ సత్యవాణి, రాజమహేంద్రవరం

అమ్మ ప్రసాదం.. మోక్షదాయకం1
1/3

అమ్మ ప్రసాదం.. మోక్షదాయకం

అమ్మ ప్రసాదం.. మోక్షదాయకం2
2/3

అమ్మ ప్రసాదం.. మోక్షదాయకం

అమ్మ ప్రసాదం.. మోక్షదాయకం3
3/3

అమ్మ ప్రసాదం.. మోక్షదాయకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement