ఏసీబీ డీఎస్పీగా కృష్ణారావు
ఏలూరు టౌన్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీఎస్పీగా జీవీ కృష్ణారావు ఏలూరులోని ఏసీబీ కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1991 బ్యాచ్ ఎస్‌ఐగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పనిచేశారు. అనంతరం ఉమ్మడి పశ్చిమలో చింతలపూడి, పెర వలి పోలీస్‌స్టేషన్‌లోనూ విధులు నిర్వర్తించారు. ఆయన సీఐగా పదోన్నతి పొందిన అనంతరం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు, ఏలూరు ఇంటెలిజెన్స్, జిల్లా క్రైమ్ బ్యూరోలోనూ పనిచేశారు. 2020లో డీఎస్పీగా పదోన్నతి పొంది ఏలూరు ఇంటెలిజెన్స్ కార్యాలయంలో డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. అనంతరం పాలకొండ ఎస్‌డీపీవోగా, ఏపీఎస్‌పీ 8వ బెటాలియన్‌లోనూ డీఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. తాజాగా ఏలూరు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అవినీతికి పాల్పడే ప్రభుత్వ కార్యాలయ అధికారులు, సిబ్బందిపై ప్రజలు నిర్భయంగా ఫోన్, లేదా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. టోల్‌ఫ్రీ నం. 1064కు సమాచారం ఇ వ్వాలని ఆయన సూచించారు.


