జిల్లాలో మహోద్యమంలా కోటి సంతకాల సేకరణ
నరసాపురం: మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గపు నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లాలో 4,19,650 మంది సంతకాలు చేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రతి గ్రామం, పట్టణాల్లోని ప్రతి వార్డులోనూ వైఎస్సార్‌సీపీ సభలు, రచ్చబండ కా ర్యక్రమాలు విస్తృతంగా నిర్వహించిందన్నారు. అ న్ని వర్గాల ప్రజలు పార్టీ చేపట్టిన సంతకాల ఉ ద్యమానికి బాపటగా నిలిచారని పేర్కొన్నారు. ని యోజకవర్గాల వారీగా నరసాపురంలో 55,000 మంది, ఆచంటలో 71,200 మంది, భీమవరంలో 55,000 మంది, పాలకొల్లులో 60,200 మంది, తణుకులో 80,250 మంది, తాడేపల్లిగూడెంలో 45,000 మంది, ఉండిలో 53,000 మంది స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారని వివరించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై రాష్ట్రవ్యాప్తంగా పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం ఓ చరిత్ర అన్నారు. వైద్య విద్యను పేదలు, మధ్యతరగతి వారికి చేరువ చేయాలనే బృహత్తర లక్ష్యంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే, వాటిని నిర్వహించడంలో చిత్తశుద్ధి లేని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుందని విమర్శించారు. ప్ర జలు మంచి చేయమని చంద్రబాబును గద్దెనెక్కించారని గుర్తుచేశారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్‌సీపీ స్వాగతిస్తుందని చెప్పారు. ఇప్పుడు కోటి మంది ప్రజలు రాతపూర్వకంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకించారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పనిచేసే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరచి ప్రజల ఇష్టాన్ని గౌరవించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రసాదరాజు డిమాండ్ చేశారు.
4,19,650 సంతకాల ప్రతుల సేకరణ
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పెల్లుబికిన ఆగ్రహం
వైఎఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు


