డీజిల్ అరకమ విరకయాలపై చర్యలు
టెట్‌కు 89.3 శాతం హాజరు
కొయ్యలగూడెం: డీజిల్ అక్ర మ విక్రయాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. ‘సాక్షి’లో ఈనెల 3న ప్రచురించిన ‘యథేచ్ఛగా హైవేలో డీజిల్ దందా’ కథనానికి అధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ ఎన్.నాగరాజు గురువారం సోదాలు చేశారు. ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా) సరిహద్దుల ప్రాంతంలో అచ్యుతాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన సుమారు 250 లీటర్ల డీజిల్‌ని గుర్తించినట్టు తహసీల్దార్ తెలిపారు. రాకపోకలు సాగిస్తున్న లారీల నుంచి టీ క్యాంటీన్ య జమాని ఆయిల్ బంకులోని ధర కంటే లీటరు రూ.20 తక్కువకు కొనుగోలు చేసి ఇతర పార్టీలకు విక్రయిస్తున్నట్టు విచారణలో తెలిసిందన్నారు. క్యాంటీన్ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు నివేదించడంతో పాటు గుర్తించిన డీజిల్‌ని గోపాలపురం రెవెన్యూ అధికారులకు స్వాధీనం చేశామని చెప్పారు.
భీమవరం: జిల్లాలోని ఆరు పరీక్షా కేంద్రాల్లో గురువారం నిర్వహించిన ఏపీ టెట్ పరీక్షలకు 89.3 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. ఉదయం 702 మందికి 629 మంది, మధ్యాహ్నం 100 మందికి 85 మంది హాజరయ్యారని, ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు.
డీజిల్ అరకమ విరకయాలపై చర్యలు


