ఉపాధ్యాయులకు టెట్‌పై పిటిషన్ వేయాలి
భీమవరం: టెట్ నిర్వహణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని, భేషరతుగా ఇన్‌స ర్వీస్ టీచర్లందరినీ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) నుంచి మినహాయించాలని ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి డిమాండ్ చేశారు. ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నిర్వహణను మినహాయించాలని గురువారం ఏపీ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ధర్నా శిబిరానికి యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీఎస్ విజయరామరాజు అధ్యక్షత వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకేవీ రామభద్రం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో మార్పులు చేయాలని, సెలవు ది నాలు, పండగ రోజుల్లో తరగతులు రద్దు చే యాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఈఓ ఈ.నారాయణకు అందజేశారు. జిల్లా గౌరవాధ్యక్షుడు పీహెచ్ పట్టాభిరామయ్య, సహాధ్యక్షుడు కె.రాజశేఖర్, కోశాధికారి పి.క్రాంతికుమార్, జిల్లా కార్యదర్శులు పి.శివప్రసాద్, ఎస్.రత్నరాజు పాల్గొన్నారు.
పాలకొల్లు సెంట్రల్: యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ (ఐఈఎస్)లో మండలంలోని లంకోడేరుకు చెందిన యువతి ప్రతిభ చాటింది. గ్రామానికి చెందిన గోపిశెట్టి సత్యనారాయణ, హైమావతి కుమార్తె కవిత బేబీ 48వ ర్యాంకుతో సత్తాచాటింది. సత్యనారాయణ పంచాయతీ సెక్రటరీగా పనిచేసి నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. కవిత బేబి ప్రాథమిక విద్య పూలపల్లిలో, ఇంటర్ ప్రైవేట్ కళాశాలలో చదివింది. ఎన్‌ఐటీ సూరత్‌లో బీ టెక్, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ పూర్తిచేసింది. తనకు చిన్ననాటి నుంచి మినిస్ట్రీ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్‌లో ఉద్యోగం సాధించాలనే ల క్ష్యం ఉండేదని, తన ర్యాంకును బట్టి తాను అ నుకున్న టెలీ కమ్యూనికేషన్స్‌లో ఉద్యోగం వ స్తుందని భావిస్తున్నానన్నారు. ఆమెకు గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.
భీమవరం: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లించేందుకు రూ.500 అపరాధ రుసుంతో రెండు రోజులు అవకాశం కల్పించినట్టు డీఈఓ ఈ.నారాయణ గురువారం ప్రకటనలో తెలిపారు. శుక్ర, శనివారాల్లో ఫీజులు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజల సానుకూల స్పందనలో పశ్చిమగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సు గురువారం ముగిసింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టులో సీఎస్‌ఎంఆర్‌ఎస్ బృందం సభ్యులు ప్రాజెక్టులో జరుగుతున్న పనులకు సంబంధించి నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. గురువారం శా స్త్రవేత్తలు లలితకుమార్ సోలంకి, రవి అగర్వాల్ నేతృత్వంలోని బృందం సభ్యులు డయా ఫ్రమ్‌వాల్‌లో వినియోగిస్తున్న కాంక్రీట్ నాణ్యతను తనిఖీ చేశారు. ప్రాజెక్టులో ఉపయోగిస్తున్న కాంక్రీట్ నమూనాలను ల్యాబ్‌లో నా ణ్యత ప్రమాణాలను పరిశీలించారు. పోలవ రం ప్రాజెక్టులో గ్యాప్–1, గ్యాప్–2 ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు కాంక్రీట్ నాణ్యతపై పరిశీలన చేయనున్నట్టు తెలిపారు. ఎస్ ఈ రామచంద్రరావు, డీఈలు శ్రీనివాస్, బాలకృష్ణ, మేఘ జనరల్ మేనేజర్ గంగాధర్, డిప్యూటీ జీఎం మురళీకృష్ణ ఉన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వినియోగదారుల ప్ర యోజనాల కోసం ఆర్టీసీ కార్గో సేవలను విస్తృతపరుస్తున్నామని ఏలూరుజిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం తెలిపారు. ఈనెల 20 నుంచి వచ్చేనెల 19 వరకూ జరిగే కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను గురువారం స్థానిక డీపీటీఓ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ కార్గో సేవలు ప్రజల మన్ననలు పొందాయన్నారు. డోర్ డెలివరీ మాసోత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశించారు.
ఉపాధ్యాయులకు టెట్‌పై పిటిషన్ వేయాలి


