మొక్కుబడి..ప్రచార హడావుడి | - | Sakshi
Sakshi News home page

మొక్కుబడి..ప్రచార హడావుడి

Dec 5 2025 5:58 AM | Updated on Dec 5 2025 5:58 AM

మొక్క

మొక్కుబడి..ప్రచార హడావుడి

మద్దిలో మహా పూర్ణాహుతి

న్యూస్‌రీల్‌

జిల్లాలో స్పందన కరువు

మద్దిలో మహా పూర్ణాహుతి
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి క్షేత్రంలో గురువారం మహా పూర్ణాహుతి నిర్వహించారు. సుమారు 3 వేల మంది దీక్షధారులు పాల్గొన్నారు.

శురకవారం శ్రీ 5 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

సాక్షి, భీమవరం: చంద్రబాబు సర్కారు నిర్వహించిన ‘రైతన్నా..మీ కోసం’ కేవలం ప్రచార ఆర్భాటమే అయ్యింది. నేతలు, అధికారుల ప్రసంగాలే తప్ప ఎన్నికల హామీల ఎగవేత, అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ సాయం అందకపోవడం, ఉచిత పంటల బీమాకు ఎసరు, మోంథా పరిహారం, కౌలు సాగుదారుల పరిస్థితిపై రైతుల ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది.

ఎక్కడికక్కడ నిలదీతలు

ఆకివీడు మండలం పెదకాపవరం శివారు కాళింగపేటలో జరిగిన అన్నదాత సుఖీభవ సాయం అందడం లేదని అధికారుల్ని నిలదీశారు. గత ప్రభుత్వంలో మాదిరి ఉచిత పంటల బీమా పథకాన్ని అమలుచేసి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆకివీడులో జరిగిన కార్యక్రమంలో ఆదర్శ రైతు మాట్లాడుతూ పొలంబడి జరగడం లేదన్నారు. వ్యవసాయాధికారులు అందుబాటులో ఉండటం లేదని, క్షేత్రస్థాయిలో తిరగడం లేదు అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. మినీ కిట్లు ఇచ్చిన తర్వాత సాగు ఎలా ఉంది అనేది అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నరసాపురం మండలంలో తూతూమంత్రంగా సభలు నిర్వహించారు. కేవలం అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు మాత్రమే సభలకు వచ్చి మమ అనిపించారు. రుస్తుంబాద, సరిపల్లి, నవరసపురం, చిట్టవరం, మల్లవరం గ్రామాల్లో జరిగిన సభల్లో డ్రెయినేజీలు ముంపు బారిన పడినా పట్టించుకోకపోవడాన్ని రైతులు తప్పుబట్టారు. నరసాపురం–నిడదవోలు ప్రధాన కాలువలో నరసాపురం నుంచి మొగల్తూరు వరకూ గురప్రుడెక్క, తూడు ఏపుగా పెరిగిపోయాయని తమ గోడు వెళ్లబోసుకున్నారు. జిల్లాలోనే జలవనరుల శాఖ మంత్రి ఉన్నా ఇక్కడి పరిస్థితి అధ్వానంగా ఉందని రైతులు వివరించారు. మొగల్తూరు మండలంలో 2 వేల ఎకరాలకుగాను 648 ఎకరాలు మాత్రమే తొలకరి సాగు చేశారు. దర్భరేవు డ్రెయిన్‌, కొత్తకాయలతిప్ప స్లూయిజ్‌ పనులు చేపట్టక తమ గ్రామంలో కేవలం 20 ఎకరాలు మాత్రమే సార్వా సాగుచేశామని రామన్నపాలెంలో జరిగిన కార్యక్రమంలో రైతులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

సమాధానాలు కరువు : పంట నష్టం పరిహారం ఎప్పుడు వస్తుందని, అన్నదాత సుఖీభవ సాయం అందడం లేదని, ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలని, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ సాయం అందజేయాలని, పంట నష్టపరిహారం ఇవ్వాలని పలు సమావేశాల్లో రైతులు అడిగిన ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానాలు కరువయ్యాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామంటూ అధికారులు, రైతులను అన్నివిధాలా ఆదుకుంటుందంటూ నేతలు కార్యక్రమాలను మమా అనిపించారు.

రైతన్నా.. మీకోసం అట్టర్‌ ఫ్లాప్‌

జిల్లాలో తూతూమంత్రంగా

కార్యక్రమం నిర్వహణ

అధికారులను నిలదీసిన రైతులు

ముఖం చాటేస్తున్న ఎమ్మెల్యేలు, కూటమి నేతలు

అన్నదాత సుఖీభవ సాయం రాలేదు

పొలం బడి జాడలేదు

వ్యవసాయాధికారులు కనిపించడం లేదు

రానున్న ఐదేళ్లలో రైతును రాజును చేసేందుకంటూ పంచ సూత్రాలంటూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హడావుడికి జిల్లాలో రైతుల నుంచి స్పందన కరువైంది. నీటి భద్రత, డిమాండ్‌ ఆధారిత పంటలు, అగ్రిటెక్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ప్రభుత్వం నుంచి మద్దతు ధర అంశాల గూర్చి ప్రతి రైతు ఇంటికి వెళ్లి తెలియజేయాలన్నది లక్ష్యం. సాగులో యాంత్రీకరణ లాభం, పంట మార్పిడి, ఎరువులు అధిక వినియోగంతో అనర్థాలు, సూచనలు సలహాలను అందజేయాల్సి ఉంది. రైతుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. ఆచరణకు వచ్చేసరికి ఆరంభ శూరత్వమైంది. సమస్యలు, ఎన్నికల హామీలపై రైతుల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో ఎమ్మెల్యేలు సైతం ప్రారంభోత్సవ కార్యక్రమాలకు మినహా తర్వాత పత్తాలేకుండా పోయారు. ఆశించిన స్థాయిలో రైతుల నుంచి స్పందన లేక పెనుగొండ, తాడేపల్లిగూడెం, పెంటపాడు, ఆచంట, పోడూరు, తణుకు, భీమవరం, పాలకొల్లు, వీరవాసరం తదితర మండలాల్లో పార్టీ కార్యకర్తలకు కండువాలు కప్పి సభల్లో కూర్చోపెట్టడం కనిపించింది.

మొక్కుబడి..ప్రచార హడావుడి1
1/1

మొక్కుబడి..ప్రచార హడావుడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement