బోదెలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
యలమంచిలి: మండలంలోని కలగంపూడి గ్రామంలో ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు గురువారం అదుపు తప్పి పంట బోదెలోకి దూసుకెళ్లింది. డ్రైవర్ బస్సును పార్కింగ్ చేయడానికి తీసుకెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. ఆ సమయంలో బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
భీమవరం (ప్రకాశం చౌక్): జిల్లాలో జల జీవన్ మిషన్ ప్రాజెక్ట్ పనులు వేగిరపర్చేందుకు సహకరించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం జలజీవన్ మిషన్ ఫేజ్–1 కింద కోస్తా ప్రాంతంలో తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ ఏర్పాటు పనులపై కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మా ట్లాడుతూ జిల్లాలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరందించేందుకు రూ.1400 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారన్నారు. 16 మండలాల పరిధిలో 862 గ్రాములను కలుపుతూ 13.25 లక్షల కుటుంబాలకు తాగునీటిని అందించేలా ప్రాజెక్టును రూపొందించారన్నారు.
తణుకు అర్బన్: దువ్వ జెడ్పీ హైస్కూల్‌లో మాల ధరించిన విద్యార్థులను ఉపాధ్యాయులు వేధించారంటూ గురువారం భవానీ మాలధారులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో భవానీ, అయ్యప్ప మాలలు ధరించిన ముగ్గురు విద్యార్థులను ఉపాధ్యాయులను వేధిస్తున్నా రు. తరగతి గదుల్లో మిగిలిన విద్యార్థులకు దూరంగా కూర్చోబెడుతున్నారని, యూనిఫాం వేసుకోవాలని కొడుతున్నారని, మిగిలిన 11 రోజుల దీక్ష సమయంలో పాఠశాలకు రావద్దని వేధిస్తుండటంతో పాటు ఓ విద్యార్థిని చేతిపై కొట్టారని విద్యార్థులు చెబుతున్నారు. దీనిపై గ్రామంలోని భవానీ మాలధారులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాలకు వ చ్చి ఉపాధ్యాయులను నిలదీశారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరలా ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని ఉపాధ్యాయు లు చెప్పడంతో మాలధారులు వెనక్కి తగ్గారు. దీనిపై డీవైఈఓ డి.మురళీ సత్యనారాయణను వివరణ కోరగా భవానీ మాల వేసుకున్న విద్యార్థులు ఆరోపణలు చేయడం వాస్తవమని, విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
భీమవరం: జిల్లావ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వా ధీనం చేసుకున్న 594 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్టు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి గు రువారం భీమవరంలో విలేకరులకు తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 21 కేసుల్లో సుమారు 594 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా దానిని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామ పరిధిలో గల జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ వద్ద గురువారం ధ్వంసం చేశారన్నారు. తాను చైర్మన్‌గా అడిషినల్ ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, నరసాపురం డీఎస్పీ జి.శ్రీవేద డ్రగ్ డిస్పోజల్ కమిటీ మధ్యవర్తుల ఆధ్వర్యంలో గంజాయి ధ్వంసం చేసినట్టు చె ప్పారు. భారీస్థాయిలో గంజాయి పట్టుకోవడానికి కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, భీమవరం టూటౌన్ సీఐ జి.కాళీచరణ్, ఈగల్ ఇన్‌స్పెక్టర్ ఎం.రవీంద్ర, ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ స్వరాజ్యలక్ష్మి, డీసీఆర్‌బీ ఎస్సై విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
బోదెలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు


