పురం.. అభివృద్ధి శూన్యం | - | Sakshi
Sakshi News home page

పురం.. అభివృద్ధి శూన్యం

Nov 7 2025 7:13 AM | Updated on Nov 7 2025 7:13 AM

పురం.

పురం.. అభివృద్ధి శూన్యం

న్యూస్‌రీల్‌

పనులేవీ జరగడం లేదు

రోడ్లు అధ్వానం

శురకవారం శ్రీ 7 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

భీమవరం (ప్రకాశం చౌక్‌): జిల్లాలోని మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయి. వీధుల్లో గోతులమయంగా రోడ్లు, పూడికపోయిన డ్రెయిన్లు కనిపిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే రోడ్లు ముంపునకు గురవడంతో పాటు పారిశుద్ధ్యం క్షీణిస్తోంది. జిల్లాలో భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణు కు, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలు, ఆకివీడు నగ ర పంచాయతీ ఉన్నాయి. ఆయా పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో ముంపు నీరు పారకపోవడం, రోజుల తరబడి నిలిచిపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. రోడ్డు గోతుల్లో నీరు నిలిచి ప్రయాణాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో చెత్త సమస్య ఎక్కువగా ఉంది.

నిధులు ఉన్నా.. పనులు సున్నా

జిల్లాలోని ఆరు పట్టణాల్లో జనరల్‌ ఫండ్స్‌, ఆర్థిక సంఘం నిధులు ఉన్నా గత వేసవిలో రోడ్లు, డ్రెయి నేజీ పనులు చేపట్టలేదు. అక్కడక్కడా తూతూమంత్రంగా పనులు చేసి వదిలేశారు. వర్షాకాలం దృష్ట్యా ముందస్తు ప్రణాళికలతో రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలు, సిల్ట్‌ తొలగింపు పనులు చేయాల్సి ఉన్నా అధికారులు అలసత్వం వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల ఊసేలేదు.

జిల్లా కేంద్రం.. మరింత దారుణం

జిల్లా కేంద్రం భీమవరం మున్సిపాలిటీలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. ఇక్కడ రోడ్లు, డ్రైయిన్లు అధ్వానంగా మారి పట్టణవాసులకు శాపంగా మారాయి. అధిక ఆదాయం కలిగిన గ్రేడ్‌–1 మున్సిపాలిటీ అయినా అధ్వానంగా పారిశుద్ధ్యం, గోతులతో నిండిన రోడ్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

గత ప్రభుత్వంలో పక్కాగా పనులు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తొలి ఏడాది నుంచి జిల్లాలోని ఆరు పట్టణాల్లో అభివృద్ధి పనులు చేశారు. రోడ్లు, డ్రెయినేజీలు, భవనాల నిర్మాణం, మరమ్మతులు జరిగాయి. ఒక్కో పట్టణంలో రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ఐదేళ్ల పాలనలో భీమవరంలో రూ.130 కోట్లు, తణుకులో రూ.60 కోట్లు, తాడేపల్లిగూడెంలో రూ.70 కోట్లు, పాలకొల్లులో రూ.40 కోట్లు, నరసాపురంలో రూ.30 కోట్లు, ఆకివీడులో రూ.30 కోట్ల మేర పనులు జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం రూ.2 కోట్ల పనులు కూడా చేయలేదు.

బిల్లు.. కాంట్రాక్లర్ల ఘొల్లు

గత ప్రభుత్వంలో చివరి ఏడాది నుంచి కూటమి ప్ర భుత్వం వచ్చిన మొదటి ఏడాది వరకు చేసిన పనులకు కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ బిల్లులు చెల్లించలేదు. ఇలా రూ.5 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. దీంతో మున్సి పాలిటీల్లో అభివృద్ధి పనులు చేసే నాథుడే కరువయ్యాడు. పనులకు అధికారులు టెండర్లు పిలుస్తున్నా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. బిల్లులు కోసం కాంట్రాక్టర్లు నిరసనలు, ధర్నాలు చేయడం, రాష్ట్రస్థాయి అధికారులను పలుమార్లు కలిసినా కూడా ప్రయోజనం లేదు..

మున్సిపల్టీ

అధ్వానంగా పారిశుద్ధ్య నిర్వహణ

గోతులతో నిండిన రహదారులు

చిన్నపాటి వర్షానికే చెరువులుగా రోడ్లు

బిల్లుల పెండింగ్‌తో పనులకు ముందుకు రాని కాంట్రాక్టర్లు

జిల్లాలోని మున్సిపాలిటీలు అస్తవ్యస్తం

పాలకొల్లు మున్సిపాలిటీలో రోడ్లు, డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు ఉండే వార్డులోనే రోడ్డు ముంపునకు గురై సచివాలయానికి వెళ్లడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ నిధులు ఖర్చు చేసి రోడ్లు, డ్రెయిన్లు అభివృద్ధి చేసి పట్టణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి.

– యడ్ల తాతాజీ, పాలకొల్లు

భీమవరంలో వేసవిలో రోడ్లు, డ్రెయిన్లు నిర్మించకపోవడంతో వర్షాలకు రోడ్లు మరింత దెబ్బతిన్నాయి. డ్రెయినేజీలు మరింత దారుణంగా ఉన్నాయి. దీంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంగా ఉన్న భీమవరంలో అభివృద్ధి పనులు వేగంగా జరగడం లేదు. రోడ్లు, డ్రెయిన్లు నిర్మించాలి.

– మారోజు గణేష్‌, భీమవరం

పురం.. అభివృద్ధి శూన్యం 1
1/6

పురం.. అభివృద్ధి శూన్యం

పురం.. అభివృద్ధి శూన్యం 2
2/6

పురం.. అభివృద్ధి శూన్యం

పురం.. అభివృద్ధి శూన్యం 3
3/6

పురం.. అభివృద్ధి శూన్యం

పురం.. అభివృద్ధి శూన్యం 4
4/6

పురం.. అభివృద్ధి శూన్యం

పురం.. అభివృద్ధి శూన్యం 5
5/6

పురం.. అభివృద్ధి శూన్యం

పురం.. అభివృద్ధి శూన్యం 6
6/6

పురం.. అభివృద్ధి శూన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement