మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం
అత్తిలి: పేదలందరికీ ఉచిత వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేయడానికి పూనుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని లక్ష్మీనారాయణపురంలో గురువారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కారుమూరి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టేలా వైద్య కళాశాలలను ప్రెవేటుపరం చేస్తున్నారన్నారు. దీనిని అడ్డుకునేందుకు పార్టీ అధినేత జగన్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని, దీనిలో భాగంగా కోటి సంతకాల రూపంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి గవర్నర్‌కు అందించనున్నారన్నారు. ప్రతిఒక్కరూ సంతకాలు చేసి సంఘీభావం తెలపాలని కోరారు. చంద్రబాబు తన హయాంలో ఒక్క మెడికల్ కళాశాలను కూడా తీసుకురాలేకపోయారన్నారు. ప్రజారోగ్యానికి గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ ఎంతో ప్రాధాన్యమిచ్చారని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచారని, అయితే ఈ పథకాన్ని నేడు కూటమి ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బుద్దరాతి భరణీప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, జెడ్పీ కో–ఆప్షన్ మెంబర్ మహ్మద్ అబీబుద్దీన్, ఎంపీటీసీ సభ్యులు ఆడారి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు బొడ్డేటి శ్రీనివాసరావు, మండల ఉపాధ్యక్షుడు దొడ్డి వెంకటేశ్వరరావు, మండల నాయకులు వెలగల అమ్మిరెడ్డి, రంభ సూరిబాబు, కంకటాల సతీష్, కోరుకొల్లు వెంకట్రావు, పోలినాటి చంద్రరావు, చిన్నరెడ్డి, కట్టా అప్పన్న పాల్గొన్నారు.
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు


