విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు

Nov 7 2025 7:13 AM | Updated on Nov 7 2025 7:13 AM

విద్య

విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు

విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు మూడు చక్రాల వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం ఓటర్ల జాబితా సవరణపై దృష్టి రెజ్లింగ్‌ రాష్ట్ర అబ్జర్వర్‌గా పీడీ రమేష్‌ పెట్టుబడిదారీ విధానంతో ప్రమాదం

కాళ్ల: విద్యార్థుల ఆరోగ్యంపై అలసత్వం వహించ వద్దని ఎంపీడీఓ స్వాతి అ న్నారు. ‘కుళ్లిన గుడ్లతో భోజనం’ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. గురువారం కాళ్ల జెడ్పీ హైస్కూల్‌ను అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. ఉపాధ్యాయులు, మధ్యాహ్నం భోజనం పథకం నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి రికార్డులు తనిఖీ చేశారు. గుడ్లు పాడవ్వడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలు ఆరోగ్యం విషయంలో అలసత్వం వహిస్తే సహించబోమని హెచ్చరించారు. ఎంపీపీ పెనుమత్స శిరీష, ఆరేటి వెంకటరత్నం ప్రసాద్‌, ఎంఈఓలు డి.శ్రీనివాసరావు, పి.ఏసుదాసు, ఎస్‌ఎంసీ చైర్మన్‌ బి.నాగరాజు ఉన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): విభిన్న ప్రతిభావంతులు మూడు చక్రాల మోటార్‌ వాహనాలకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. శారీరక వైకల్యం కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, అనంతరం సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కలిపి దరఖాస్తును ఈనెల 25లోపు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ రూపకల్పనపై జిల్లా ఎన్నికల అధికారులు దృష్టి సారించాలని ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ తెలి పారు. గురువారం ఓటర్ల ప్రక్షాళన జాబితా త యారీపై కలెక్టర్లతో వర్చువల్‌ విధానంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బీఎల్‌ఓలు ఇంటింటా సర్వే చేపట్టాలని, ఓటర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన తప్పనిసరిగా ఉండేలా అధికారులు శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ ప్రక్రియను రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో చేపట్టాలన్నారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ నాగరాణి, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి పాల్గొన్నారు.

డేటా ఆధారిత పాలనపై..

డేటా ఆధారిత పాలనపై ముఖ్యమంత్రి చంద్ర బాబు నేతృత్వంలో గురువారం సదస్సు నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి హాజరయ్యారు.

దెందులూరు: స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రెజ్లింగ్‌ పోటీలకు రాష్ట్ర అబ్జర్వర్‌గా గోపన్నపాలెం ఉన్నత పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ రమేష్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కృష్ణా జిల్లా నున్నలో జరిగే రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో అబ్జర్వర్‌గా విధులు నిర్వహిస్తారు. మూడు రోజులు పాటు రెజ్లింగ్‌ పోటీలు జరుగుతాయి.

ఏలూరు (టూటౌన్‌): కొద్దిమంది వ్యక్తుల దగ్గర పోగుబడిన సంపద, పెట్టుబడుదారీ విధానం పతనానికి దారి తీస్తుందని సీఐటీయూ ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ప్రపంచ పరిణామాలు సోషలిజం అనివార్యం అనే అంశంపై స్థానిక సీతారామ భర్తీయా కల్యాణ మండపంలో గురువారం రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారీ విధానం పేదల పొట్ట కొట్టి కార్పొరేట్‌ శక్తుల కబంధ హస్తాల్లో బంధిస్తుందని, నేటి ప్రపంచ పరిణామాలు ఇందుకు ఉదాహరణగా ఉన్నాయన్నారు. ఈ సదస్సుకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.లింగరాజు అధ్యక్షత వహించారు.

విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు 1
1/1

విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement