 
															కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర
పెంటపాడు: ధాన్యానికి మద్దతు ధర పొందేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. గురువారం రావిపాడు సొసైటీ కార్యాలయం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. దళారులకు ధా న్యం విక్రయించి నష్టపోవద్దన్నారు. ధాన్యం విక్రయాల్లో సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశామని, రైతులు 81216 76653, 18004251291 నంబర్లలో సంప్రదించాలన్నారు. అనంతరం మిల్లుకు తరలించేందుకు వీలుగా సిద్ధం చేసిన ధాన్యం ట్రక్కును ఆమె ప్రారంభించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కూటమి నేత వలవల బాబ్జి, జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీవో ఖతీబ్‌కౌసర్‌భానో, జిల్లా వ్యవసాయశాఖ అధికారి జెడ్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నష్టాల వివరాలు వెల్లడి
భీమవరం (ప్రకాశంచౌక్): మోంథా తుపాను కారణంగా జిల్లావ్యాప్తంగా జరిగిన ప్రాథమిక నష్టం అంచనాలను, చేపట్టిన ముందస్తు చర్యలను కలెక్టర్ సీహెచ్ నాగరాణి గురువారం వివరించారు. జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి పాక్షికంగా జరిగిన నష్టాల వివరాలను వెల్లడించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
