కొనుగోడు తీరేనా? | - | Sakshi
Sakshi News home page

కొనుగోడు తీరేనా?

Oct 26 2025 9:20 AM | Updated on Oct 26 2025 9:20 AM

కొనుగ

కొనుగోడు తీరేనా?

న్యూస్‌రీల్‌

సమస్యల్ని పరిష్కరించాలి

ఇబ్బంది లేకుండా చూడాలి

24 గంటలను రెండు నెలలు చేశారు

24 గంటల్లోనే జమ చేయాలి

జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. అంచనా దిగుబడి, సేకరణ లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొలి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం తాడేపల్లిగూడెంలో ప్రారంభించనున్నారు. 48 గంటల్లోనే ధాన్యం సొమ్ములు జమచేస్తామని ప్రభుత్వం చెబుతుండగా గత సీజన్‌లో అనుభవాల దృష్ట్యా ఈసారి సేకరణ సవ్యంగా సాగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

సాక్షి, భీమవరం: జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో తొలకరి సాగు చేశారు. ముందుగా నాట్లు వేసిన తాడేపల్లిగూడెం రూరల్‌లో ఇప్పటికే కోతలు మొదలయ్యాయి. పీఆర్‌ 126, విత్తనం కోసం సాగుచేసిన ఎంటీయూ 1121 స్వల్పకాలిక రకాలకు సంబంధించి దాదాపు ఆరు వేల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. తణుకు, ఉండి, ఆచంట, భీమవరం, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లోని అధికశాతం విస్తీర్ణంలో వరిపంట చిరుపొట్ట దశ నుంచి పూత దశల్లో ఉంది. జిల్లా అంతటా మరో పదిరోజుల్లో వరికోతలు మొదలవుతాయని రైతులు అంటున్నారు.

జిల్లాలో 5.8 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా కాగా సేకరణ లక్ష్యం ఐదు లక్షల మెట్రిక్‌ టన్నులుగా అధికారులు నిర్ణయించారు. వరి కామన్‌ వైరెటీ క్వింటాల్‌కు రూ. 2369, ఏ గ్రేడ్‌ రకాలకు రూ. 2389కు కొనుగోలు చేయనున్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన 48 గంటలలోపే చెల్లింపులు చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.

అస్తవ్యస్తంగా..

గత రెండు సీజన్లుగా ధాన్యం సేకరణ అస్తవ్యస్తంగా తయారై రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. మిల్లింగ్‌ సామర్థ్యాన్ని బట్టి మిల్లులకు లెవీ లక్ష్యాలను నిర్ణయించారు. ఈ మేరకు టార్గెట్‌ పూర్తయిన మిల్లులు ధాన్యం సేకరణ చేయక కొందరు రైతులు దళారులను ఆశ్రయించి అయినకాడికి అమ్ముకోవడం, మరికొందరు ఇబ్బందులు పడుతూ దూర ప్రాంతాల్లోని మిల్లులకు తరలించుకోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి. గత రబీలో జిల్లాలో 2.2 లక్షల ఎకరాల్లో దాళ్వా సాగు చేయగా 9.25 లక్షల మెట్రిక్‌ టన్ను (మె.ట) దిగుబడికి కేవలం ఆరు లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సేకరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. రైతుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో తర్వాత 7.5 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచింది.

సంచులకు సమస్యే

మొదట్లో సంచులకు కొరత లేదన్నట్టుగా కనిపించినా మాసూళ్లు ముమ్మరంగా జరుగుతున్నప్పుడు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో లోపాలు బయటపడుతున్నాయి. గత దాళ్వాలో ఆచంట, పాలకొల్లు, తణుకు నియోజకవర్గాల్లోని పలుచోట్ల గోనెసంచుల కొరతతో రైతులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సంచులు అందక ఆరిన ధాన్యాన్ని వారం రోజులపైనే రోడ్లు పక్కన, కళ్లాల్లోనే ఉంచేసిన రైతులు ఎందరో ఉన్నారు. కొందరు మిల్లర్లు సంచులను రైతులకు కాకుండా దళారులకు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రైతు సేవా కేంద్రాల్లో ధ్రువీకరించిన తేమశాతం మేరకు మిల్లర్లు కొనుగోలు చేయాలని అధికారులు చెబుతుండగా, అందుకు మిల్లర్లు అంగీకరించడం లేదని రైతులు అంటున్నారు. తేమశాతం పేరిట కోత పెడుతున్నారని చెబుతున్నారు. వే బ్రిడ్జిల వద్ద మోసాలు జరుగుతున్నాయని అంటున్నారు.

రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయశాఖ సిబ్బంది నిర్ణయించిన తేమ శాతాన్ని మిల్లర్లు ఒప్పుకోవడం లేదు. తేమ శాతం ఎక్కువ ఉందని కోత పెడుతున్నారు. వేబ్రిడ్జిల వద్ద తూకాల్లోనూ తేడాలుంటున్నాయి. రైతులు నష్టపోకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.

– ములగాల గంగారావు, రైతు, దండగర్రు

పంట చేతికొచ్చే సమయంలో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీడం లేదు. ఇప్పటికే చాలాచోట్ల వరిపంట పడిపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. గతంలో మాదిరి కాకుండా వెంటనే రైతులకు ధాన్యం డబ్బులు జమచేయాలి.

– దేవరశెట్టి రాంబాబు, కౌలు రైతు, బి.కొండేపాడు

ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. రబీలో రెండో దశ సొమ్ములు వేయడానికి రెండు నెలల సమయం పట్టడం గమనార్హం. జిల్లాలో దాదాపు 77 వేల మంది రైతుల నుంచి రూ.1,650 కోట్లు విలువైన 7.17 లక్షల మె.ట ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటిలో రూ.1,360 కోట్లు రైతుల ఖాతాలకు జమచేసింది. సుమారు 18 వేల మంది రైతులకు రూ.290 కోట్లు మేర నెలన్నర రోజులు వరకు చెల్లింపులు చేయక రైతులు తీవ్ర అగచాట్లు పడ్డారు. ఆయా అవరోధాలను అధిగమించడం ద్వారా ధాన్యం కొనుగోళ్లు సవ్యంగా సాగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

రబీ ధాన్యం సొమ్మును జమ చేయకుండా రెండు నెలల పాటు జాప్యం చేయడంతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. మొదటి నుంచి చివరి రైతుకు సకాలంలో సొమ్ములు చెల్లించాలి. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి.

– చిన్నం రామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు

రేపటి నుంచి జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

సేకరణ లక్ష్యం ఐదు లక్షల మెట్రిక్‌ టన్నులు

గత రబీ చివరిలో కొనుగోలు కష్టాలు

దాదాపు రెండు నెలల పాటు

సొమ్ములందక రైతుల ఇక్కట్లు

కొనుగోడు తీరేనా? 1
1/4

కొనుగోడు తీరేనా?

కొనుగోడు తీరేనా? 2
2/4

కొనుగోడు తీరేనా?

కొనుగోడు తీరేనా? 3
3/4

కొనుగోడు తీరేనా?

కొనుగోడు తీరేనా? 4
4/4

కొనుగోడు తీరేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement