తుపానుపై అప్రమత్తంగా ఉండాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్టచర్యలు తీసుకోవాలని, అధికారులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేశామని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెనన్స్ హాల్ నుంచి కలెక్టర్ మొంథా తుపాను ప్రభావాన్ని యంత్రాంగం సమర్థంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుపాను కారణంగా ఈ నెల 26 నుంచి 29 వరకు జిల్లాలో భారీగా వర్షాలు కురియనున్న దృష్ట్యా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. తీరం దాటే సమయంలో సుమారు గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. తొలుత వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ తుపాను సమర్ధంగా ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. గూగుల్ మీట్‌లో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్‌ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పి.సూర్యనారాయణ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ జి.గీతా బాయి తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
భీమవరం: యువత, విద్యార్థులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా ఎకై ్సజ్ అధికారులు ప్రధాన బాధ్యత నతీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం భీమవరం కలెక్టరేట్‌లో సురక్ష యాప్ వినియోగం, ప్లాస్టిక్ నిషేధం, గంజాయి వంటి మత్తు పదార్థాల తనిఖీలు, ఎకై ్సజ్ శాఖ ప్రగతి వంటి అంశాలపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. కల్తీ, అక్రమ మద్యాన్ని పూర్తిగా నిరోధించేందుకు ప్రభుత్వం వినియోగదారులకు సురక్ష యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మద్యం షాపులు, బార్లు వద్ద నూరు శాతం ప్లాస్టిక్ నిషేధం అమలు జరిగేలా పర్యవేక్షించాలన్నారు.


