
కార్తీకమాస ఏర్పాట్ల పరిశీలన
భీమవరం (ప్రకాశం చౌక్ ): భీమవరం గునుపూడిలోని పంచారామక్షేత్రం ఉమా సోమేశ్వర జనార్దనస్వామి దేవస్థానంలో కార్తీకమాస ఏర్పాట్లను దేవదాయశాఖ ఆర్‌జేసీ వేండ్ర త్రినాథరావు ఆదివారం పరిశీలించారు. దేవస్థానంలో క్యూలైన్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23 నుంచి ప్రారంభకానున్న కార్తీక మాసోత్సవాలకు వేలాది మంది భక్తులు రానున్న దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఈవోకు సూచించా రు. భక్తులకు టాయిలెట్స్, మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. దేవస్థానం చైర్మన్ చింతలపాటి బంగారురాజు, ఈఓ డి.రామకృష్ణంరాజు, సిబ్బంది ఉన్నారు.
భీమవరం: అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ 21.7 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా తాడేపల్లిగూడెంలో అధికంగా 42.4 మి.మీ., పెంటపాడులో 16.8, తణుకులో 10.4, అత్తిలిలో 22.6, గణపవరంలో 32.4, ఆకివీడులో 25.6, ఉండిలో 22.6, పాలకోడేరులో 37.2, పెనుమంట్రలో 35.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇరగవరంలో 12.2, పెనుగొండలో 6.8, ఆచంటలో 10.4, పోడూరులో 19.4, వీరవాసరంలో 23.2, భీమవరంలో 10.6, కాళ్లలో 26.8, మొగల్తూరులో 25.4, నరసాపురంలో 16.2, పాలకొల్లులో 17, యలమంచిలిలో 20.2 మి.మీ.. మొత్తంగా 433.4 మి.మీ. వర్షపాతం నమోదైంది.