
మున్సిపల్ కార్మికుల సమ్మె జయప్రదానికి పిలుపు
ఏలూరు (టూటౌన్): నగరపాలక సంస్థలు, పుర పాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఉద్యోగ, సిబ్బంది సమస్యల పరిష్కారానికి వచ్చేనెల 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెను, అలాగే ఈనెల 22న ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే పిలుపునిచ్చారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె తలపెట్టామన్నారు. ఆదివారం స్థానిక స్ఫూర్తి భవనంలో ఏలూరు ఏరియా కార్యదర్శి ఎ.అప్పలరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం అధికారం చేపట్టి 16 నెలలు పూర్తయినా ము న్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. 11వ పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, బకాయిపడిన డీఏలను తక్షణం చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ పేమెంట్స్‌ను చెల్లించాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.