
అక్రమ మద్యాన్ని అడ్డుకోవాలి
రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మద్యం, కల్తీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతుంది. అనేక చోట్ల కల్త మద్యం తయారు చేస్తున్న మద్యం మాఫియా గుట్టు బట్టబయలు అవుతుంది. కూటమి ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడంలేదు. ఏలూరు జిల్లాలో అక్రమ మద్యం వ్యాపారం భారీగా సాగుతుంది. టైమింగ్స్ లేకుండా అర్థరాత్రి వరకూ మద్యం విక్రయిస్తూ.. మళ్ళీ తెల్లవారుజామునే దుకాణాలు తెరుస్తున్నారు. కూటమి నేతలే మద్యం షాపులను నిర్వహిస్తూ ఉండడంతో అధికారులు సైతం అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
– జిజ్జువరపు విజయనిర్మల, ఏలూరు నగర మహిళ అధ్యక్షురాలు, వైఎస్సార్‌సీపీ