
ప్రజల ప్రాణాలతో చెలగాటం
కూటమి ప్రభుత్వం, నేతలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఒకవైపు అక్రమ మద్యం, మరోవైపు కల్తీ మద్యంతో ప్రజలు మద్యానికి బానిసలుగా మారిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కుటుంబంలో భర్త పనికి వెళ్ళకుండా మద్యం తాగుతూ వేధింపులకు గురిచేస్తూ ఉంటే... కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మహిళలు అంతా ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లు వేశామా ? అని బాధపడుతున్నారు. ప్రతీ గ్రామంలోనూ మద్యం బెల్టు షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు.
– నిట్టా లీలా నవకాంతం, దెందులూరు జెట్పీటీసీ