
వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం అధికార ప్రతినిధిగా సయ్యద
ఉంగుటూరు: వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంగుటూరుకు చెందిన షేక్ సయ్యద్ బాజీని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం ప్రకటన వెలువడింది. మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబను సయ్యద్ బాజీ, మైనారిటీ నేతలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బాజీ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు 2000కు పైగా మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను వెంటనే పరిష్కరించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి డిమాండ్ చేశారు. గత జనవరి నుంచి అన్ని మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు అప్రూవ్ కాకుండా అలాగే ఉన్నాయని, విద్యాశాఖకు సంబంధించిన దాదాపు 700 బిల్లులు పరిష్కారానికి నోచుకోకుండా పడి ఉన్నాయని, త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించకపోతే యుటీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని యుటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి అన్నారు. పీఎఫ్ లోన్లు అప్లికేషన్ పెట్టిన తర్వాత 20 రోజులలోపు సీఎఫ్‌ఎంఎస్ లోనికి వెళ్ళేలా చూడాలని కోరారు.
మావుళ్ళమ్మ దేవస్థానం చైర్మన్‌గా నాగభూషణం
భీమవరం(ప్రకాశంచౌక్): భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్‌గా బొండాడ నాగ భూషణాన్ని నియమించినట్లు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగ భూషణాన్ని అభినందించి మాట్లాడారు. నాగ భూషణం మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
అగ్నిప్రమాదంలో బేకరీ దగ్ధం
పెనుగొండ: విద్యుత్ షార్ట్ సర్క్యుట్‌తో సిద్ధాంతంలో బెంగుళూరు అయ్యంగార్ బేకరీ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో రూ.25 లక్షలకు పైగా ఆస్థి నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద శబ్దాలతో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. పాలకొల్లు నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి శ్రమించాల్సి వచ్చింది.

వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం అధికార ప్రతినిధిగా సయ్యద

వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం అధికార ప్రతినిధిగా సయ్యద