
ట్రిపుల్ ఐటీకి చేరుకుంటున్న పీయూసీ–1 విద్యార్థులు
నూజివీడు: పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులు సోమవారం నూజివీడు ట్రిపుల్‌ఐటీకి చేరుకున్నారు. నూజివీడుతో పాటు ఒంగోలు, శ్రీకాకుళంకు సంబంధించిన పీయూసీ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 2030 మంది తొలిరోజు నూజివీడు క్యాంపస్‌కు చేరుకున్నారు. విద్యార్థులతో పాటు వారి వెంట తల్లిదండ్రులు రావడంతో క్యాంపస్‌లో కోలాహలం నెలకొంది. డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ అధికారులు రాజేష్, దుర్గాభవానీలు, చీఫ్ వార్డన్‌లు సురేష్‌బాబు, గౌతమిలు కేర్‌టేకర్‌ల సహాయంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా రూంలు కేటాయించారు.

ట్రిపుల్ ఐటీకి చేరుకుంటున్న పీయూసీ–1 విద్యార్థులు