
నరసాపురం లేసుకు ఓడీఓపీ అవార్డు
భీమవరం (ప్రకాశంచౌక్) : న్యూఢిల్లీలో కేంద్ర ప్రభు త్వ వాణిజ్య పన్నులు, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ‘నరసాపూర్ క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్’కు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చేతులమీదుగా కలెక్టర్ సీహెచ్ నాగరాణి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నరసాపురం లేసు అల్లికలకు గతేడాది జీఐ గుర్తింపు రావడం, ఇప్పుడు వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) కింద అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ గుర్తింపులతో వేలాది మంది నేత కార్మికులు, కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వగలుగుతామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో లేసు ఉత్పత్తులు గుర్తింపు పొందడంతో పాటు ఇప్పుడు ఈ అవార్డు అందుకోవడం లేసు తయారీదారుల కృషి ఫలితం అన్నారు. లేసు తయారీదారులకు కలెక్టర్ నాగరాణి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.