చిన్న వెంకన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు స్వామి వారినికి దర్శించకున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో క్షేత్ర పరిసరాలు భక్తులతో కళకళలాడాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అలాగే ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివెట్టి మండపం, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట, నిత్యాన్నదాన విభాగాలు భక్తులతో పోటెత్తాయి. అలాగే ఆలయ అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.


