ఘనంగా దర్శకరత్న దాసరి వర్థంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా దర్శకరత్న దాసరి వర్థంతి

May 31 2025 1:26 AM | Updated on May 31 2025 1:43 AM

ఘనంగా దర్శకరత్న దాసరి వర్థంతి

ఘనంగా దర్శకరత్న దాసరి వర్థంతి

పాలకొల్లు సెంట్రల్‌: తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా అత్యధిక చిత్రాలు తీసి గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించి పాలకొల్లు కీర్తిని ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేసిన సినీ దిగ్గజం దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణరావుకే దక్కుతుందని పలువురు దాసరి అభిమానులు ఆయన సేవలను కొనియాడారు. శుక్రవారం స్థానిక గాంధీబొమ్మల సెంటర్‌ నందు పట్టణ నటీనట సంక్షేమ సమాఖ్య, దాసరి నారాయణరావు అభిమానుల ఆధ్వర్యంలో దాసరి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ నటీనట సంక్షేమ సమాఖ్య సభ్యులు, దాసరి అభిమానులు మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో అనేక మైలురాళ్లు దాటిన ఘనత దాసరికే సాధ్యమైందన్నారు. అలాగే పట్టణంలో మహిళా కళాశాలకు భూమి విరాళంగా ఇచ్చి విద్యాదాతగా కీర్తిని పొందారన్నారు. అలాగే పట్టణంలో గాంధీబొమ్మల సెంటర్‌ వద్ద రాజ్యసభ నిధులతో కాలిబాట వంతెన ఏర్పాటు ఎంతో మందికి మార్గం సుగమం చేశారన్నారు. కార్యక్రమంలో వంగా నరసింహరావు, మేడికొండ శ్రీనివాసరావు. యర్రంశెట్టి వెంకటరత్నం, కొట్టి భాస్కరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement