
వ్యాన్‌ను ఢీకొన్న కంటైనర్
జాతీయ రహదారిపై దెందులూరు హెచ్‌పీ పెట్రోలు బంకు వద్ద మంగళవారం వ్యాన్‌ను కంటైనర్ లారీ ఢీకొనడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. 8లో u
గ్రామాల్లో చెత్త తొలగింపు
ఇరగవరం: ‘గ్రామాల్లో పడకేసిన పారిశుద్ధ్యం’ శీర్షికన గత సోమవారం సాక్షిలో వచ్చిన కథనానికి పంచాయతీ అధికారులు స్పందించారు. గ్రామాల్లోని చెత్తను ట్రాక్టర్లలో డంపింగ్ యార్డులకు తరలించారు. కార్యదర్శులకు ఈవోపీఆర్డీ నరసింహ మూర్తి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని ఆదేశాలిచ్చారు. గ్రామాల్లో చెత్త తొలగించడంతో ప్రజలు హర్షం చేశారు.
పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలి
భీమవరం (ప్రకాశంచౌక్): పరిశ్రమల కోసం దరఖాస్తులను గడువులోగా పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన చాంబరులో పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో మాట్లాడుతూ యువతకు పారిశ్రామిక యూనిట్ల స్థాపనపై అవగాహన కల్పించాలన్నారు. రైసు మిల్లులు, ఆక్వా, కాయిర్ సెక్టారుకు సంబంధించి ఉత్పత్తులు, ఎగుమతుల అవకాశాలు చర్చించేందుకు వర్క్‌షాపు నిర్వహించాలన్నారు .

వ్యాన్‌ను ఢీకొన్న కంటైనర్