
కాపు అంతంతమాత్రం
ఈ ఏడాది కాపు అంతంత మాత్రంగా ఉంది. మూడేళ్ల నుంచి కాపు సరిగా లేక, తెగుళ్లతో ఇబ్బంది పడుతున్నాం. సరైన ఆదాయం లేదు. ఈ ఏడాదీ ఆదాయం పెరిగే సూచనలు లేవు. రెండు, మూడు రోజుల నుంచి కాయల దిగుబడి వస్తోంది. మరో వారంలో పూర్తిస్థాయిలో మార్కె ట్లోకి కాయలు వస్తాయి.
– అడ్డాల శ్రీరంగం, రైతు, మొగల్తూరు
తోటలు తగ్గిపోతున్నాయి
ఏటేటా తోటలు తగ్గిపోతున్నాయి. తోటలు నరికేసి లేఅవుట్స్ వేస్తున్నారు. ఆలస్యంగా కాపు కాయడంతో మిగిలిన చోట్ల సీజన్ అయిపోతుందనగా ఇక్కడ ప్రారంభమవుతుంది. దీంతో వీటికి డిమాండ్ ఎక్కువ. ముఖ్యంగా దేశ, విదేశాల్లోని బంధువులకు, స్నేహితులకు వీటిని పంపిస్తారు.
– కొప్పినీడి శ్రీనివాస్, రైతు, పేరుపాలెం
●

కాపు అంతంతమాత్రం