
పింఛన్.. ప్రతినెలా టెన్షన్
వైఎస్ జగన్ పాలనలో వలంటీర్లు ప్రతి నెలా 1వ తేదీన ఠంచనుగా తలుపు తట్టి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్ డబ్బులు ఇచ్చి వెళ్లేవారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాము కూడా ఇంటికే పింఛన్ అందిస్తున్నామని చెబుతున్నా ఆ దిశగా సరైన చర్యలు తీసుకోకపోవడంతో పింఛన్ లబ్ధిదారులకు అగచాట్లు తప్పడం లేదు. దీంతో వృద్ధులు, వికలాంగులు పింఛన్ సొమ్ముల కోసం సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కొన్ని సచివాలయాలు తాళాలు వేసి ఉండడం, కొన్నిచోట్ల సచివాలయాల్లో సిబ్బంది ఉండకపోవడంతో వృద్ధులు, వికలాంగులు పింఛన్ డబ్బుల కోసం పడిగాపులు పడాల్సిన దుస్థితి తలెత్తింది.
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు

పింఛన్.. ప్రతినెలా టెన్షన్